ఆర్టిఐ అంటే పారదర్శక పాలన
- డాక్టర్ వర్రే వెంకటేశ్వర్లు
విశ్వంభర, హైదరాబాద్: సోమవారం సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి అవగాహన సదస్సు డాక్టర్ చంటి ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షులు సూర స్రవంతి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిదులుగా రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ సభ్యులు , మాజీ ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ వర్రే వెంకటేశ్వర్లు, తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్లు పివి శ్రీనివాస్, మొహసిన పర్వీన్, దేశాల భూపాల్, హీరో కిరణ్ కుమార్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ వర్రే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం ద్వారానే పారదర్శక పాలన అందుతుందని అధికారులు జవాబుదారీతనంగా వెళ్లాలని తద్వారా దేశంలో అవినీతి నిర్మూలించబడుతుందని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పారదర్శక కోరుకునే విధంగా చాలా రోజులుగా అన్ని రకాల కమిషన్లు తెలంగాణ రాష్ట్రంలో లేనందువలన ప్రజలు ఇబ్బందులకు గురయినారని ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే అన్ని కమిషన్లు ఏర్పాటు చేయడం కమిషన్లు ఏర్పాటు చేయడం పారదర్శక పాలన నిదర్శనమని అన్నారు. ఆర్టిఐ పట్ల అవగాహన చాలా తక్కువగా ఉన్నందున విద్యావంతులు ఉద్యోగస్తులు మీడియా ఎన్జీవో సంస్థలు ప్రజలకు అవగాహన పెంచేందుకు కృషి చేయాలని కోరారు. ఆర్టిఐ ని ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో కమిషన్ల పాత్ర ముఖ్యమైనదని కమిషనర్లు క్రియాశీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. మహాత్మా గాంధీ కన్న కలలు నిజం కావాలంటే సమాచార హక్కు చట్టం గూర్చి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.పివి శ్రీనివాస్ మాట్లాడుతూ అనేక మంది త్యాగాల ఫలితంగానే సమాచార హక్కు చట్టం ఏర్పడిందని తెలిపారు. సమాచార హక్కు చట్టం అమలులో అధికారులు పారదర్శకంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి జిల్లాలకు వెళ్లి సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. భూపాల్ మాట్లాడుతూ గత ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని అమలు చేయలేకపోవడం వల్ల దాదాపు 18 వేల కేసులు పెండింగ్లో ఉన్నాయని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొని సమాచార చట్టాన్ని అమలు చేయడం జరిగిందన్నారు. పది నెలల్లోనే అనేక జిల్లాలలో కమిషన్ పర్యటించి పెండింగ్ కేసులను పరిష్కరించామని వివరించారు. మొహసిన పర్వీన్ మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలే సమాచార హక్కు చట్టంలో ఉన్నాయన్నారు. చట్టంలో మార్పులు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కొంతమంది ఉద్యోగులకు చట్టాలపై అవగాహన లేకపోవడం వల్ల సరైన సమాచారాన్ని అందించలేకపోవడం వల్ల ప్రజలకు చట్టాలపై నమ్మకం పోతుందన్నారు. చట్టాలలో సంస్కరణలు చేయాలన్నారు.సినీ హీరో కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఆర్టీఐ చట్టం వజ్రాయుధం లాంటిదని అన్నారు. 2005 లో వచ్చిన ఈ చట్టంతో ప్రజలకు నేటికి సరైన సమాచారం ప్రభుత్వ అధికారుల నుంచి రాకపోవడం దురదృష్టకరం అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం గౌడ్, జాతీయ ఉపాధ్యక్షులు గోపినాదన్ కట్టెకోల, జాతీయ కార్యదర్శి తోట శ్రీనివాస్, జాతీయ సహాయ కార్యదర్శి వంగల వివేకానందు, రాష్ట్ర కన్వీనర్ కిఫాయాత్,అధికార ప్రతినిధి కాశీ సతీష్ కుమార్, కో కన్వీనర్ గడప కృష్ణ, రాష్ట్ర కోఆర్డినేటర్ కొంగటి రాజకుమార్, ఉపాధ్యక్షులు ప్రకాష్ పటేల్,కార్యదర్శి కడమంచి అజయ్ కుమార్, కార్యదర్శి కండె సాగర్, కేడల ప్రసాద్, రమేష్,స్వప్న, కార్తీక్ రెడ్డి, శివకుమార్, చిలుక నారాయణ, ఠాకూర్ విజయ్ రామ్ సింగ్, కేయం రఫీక్ అలీ, సోమవారం రవి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



