సఖి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం
On
విశ్వంభర, మేడ్చల్: ఆల్వాల్ శుభ శ్రీ గార్డెన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సఖి మహిళా మండలి ఫౌండర్ చైర్మన్ నరాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సఖి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 4294 కుటుంబాలకు చేయుత అందిచడం జరిగిందని అన్నారు. మన రాష్ట్రంలోనే కాకుండా దేశ, విదేశాలలో సింఘాపూర్, మలేషీయా, అమెరికా లో కూడా సఖికార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు . సఖీ ముఖ్య ఉద్దేశం మహిళని ప్రోత్సాహస్తూ, వారి పట్ల జరిగే అన్యాయాలను అరికట్టడమే నని అన్నారు. మహిళ లేనిదే జగతి లేదు మహిళ ఒక శక్తి, మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని అన్నారు. ఈ కార్యక్రమానికి మాజి కార్పొరేటర్ శాంతి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్, శ్రీనివాస్, హాజరై మహిళలను సత్కరించారు.



