ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాలి

ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాలి

విశ్వంభర, ఇనుగుర్తి: ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవడంలో పేరెంట్స్ పాత్ర కీలకమైనదని వందేమాతరం ఫౌండేషన్ ఫౌండర్ తక్కల్లపల్లి రవీందర్ రావు అన్నారు. మండల కేంద్రం ఇనుగుర్తి లోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో సోమవారం గ్రామ విద్యా కమిటీ అధ్యక్షులు దార్ల రామ్మూర్తి ఆధ్వర్యంలో మనబడి బాగు కోసం గ్రామస్తుల విస్తృతస్థాయి సమావేశం కార్యక్రమానికి రవీందర్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడం పై ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు ఈ దిశగా ఆలోచించి పాఠశాలలను రక్షించుకోవడానికి ముందడుగు వేయాలన్నారు.సర్పంచి తమ్మడపల్లి కుమార్, ఎంఈఓ రూపా రాణి,దిశ కమిటీ సభ్యులు బాబురావు,టి కృష్ణమాచార్యులు,దార్ల రామ్మూర్తి ప్రభృతులు  మాట్లాడుతూ..పేరెంట్స్ సమావేశాలకు హాజరై తమ పిల్లల భవిష్యత్తును తెలుసుకొని తగిన సలహాలు ఇవ్వాలన్నారు. పిల్లలకు వేసవి సెలవులలో విద్యాబోధనకు,బడి అభివృద్ధి కోసం సహాయం అందజేయాలని కోరారు. కార్యక్రమంలో హెచ్ఎం వీరన్న,గంజి శ్రీనివాస్ రెడ్డి,మహేందర్ రెడ్డి, కొట్టం రాము,గంజి రాజేందర్ రెడ్డి, టీచర్స్,పేరెంట్స్,విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags: