జక్కాపూర్ విద్యార్థికి స్టేట్ సెకండ్ ర్యాంక్
విశ్వంభర, సిద్దిపేట: ఫోరం ఆఫ్ ఫిజికల్ సైన్స్ నిర్వహించిన రాష్ట్రస్థాయి భౌతిక, రసాయన శాస్త్ర ప్రతిభా పరీక్షలో నారాయణరావుపేట మండలం జక్కాపూర్ జడ్పిహెచ్ఎస్ 9వ తరగతి విద్యార్థి అశ్విత్ రెడ్డి ప్రతిభను కనబరిచి రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు కైవసం చేసుకున్నాడు. 33జిల్లాల నుంచి దాదాపు 100 మంది పాల్గొన్న ఈ ప్రతిభా పరీక్షలో అశ్విత్ రెడ్డి 50మార్కుల గాను 35మార్కులు సాధించి ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్ చేతుల మీదుగా రూ.2వేల నగదు పురస్కారం, రూ.2వేల విలువగల సైన్స్ కిట్ ను బహుమానంగా అందుకున్నాడు. ఈ సందర్భంగా గైడ్ టీచర్ ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు అల్లాడి లక్ష్మీనర్సయ్య కూడా డైరెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. 2025లో ఎన్ఎంఎంఎస్ జిల్లా మొదటి ర్యాంకు సాధించిన అశ్విత్ రెడ్డి ఈ సంవత్సరం ఫిజికల్ సైన్స్ రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కొమ్మూరి పద్మ, ఉపాధ్యాయులు అశ్విత్ ను అభినందించారు.



