అంత్యక్రియల ఖర్చులు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి.. డా. కోడి శ్రీనివాసులు.
అన్ని కులాల పెద్దలతో ఆదివారం నాడు సమావేశం
విశ్వంభర, చండూరు:- మున్సిపల్ పరిధిలో చనిపోయిన వారికి నిర్వహించే అంత్యక్రియలకు అయ్యే ఖర్చును పారదర్శకంగా, అందరికీ ఆమోదయోగ్యంగా నిర్ణయించేందుకు స్థానిక కులపెద్దలతో రాబోయే ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించాలని కౌన్సిల్ సమావేశంలో చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్ణయించింది. ఇట్టి సమావేశంలో కులపెద్దల అభిప్రాయాలు, సూచనలు స్వీకరించి, వాటిని పరిశీలించిన అనంతరం తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించబడింది. పేద కుటుంబాల్లో ఎవరైనా చనిపోయినప్పుడు అంత్యక్రియలు నిర్వహించుటకు నానా ఇబ్బందులు పడుతున్నారని, ప్రజల విన్నపం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అదేవిధంగా, ప్రతిరోజూ ఉపాధి కోసం వచ్చే కూలీల సౌకర్యార్థం గుండ్రేపల్లి చౌరస్తాను ప్రత్యేక "లేబర్ అడ్డా"గా కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. పట్టణ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు మెరుగైన పౌర సేవలు అందించేందుకు చండూరు మున్సిపాలిటీ కట్టుబడి ఉందని అన్నారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ బూతరాజు దశరథ, కౌన్సిలర్లు తేలుకుంట్ల రాజకుమారి, బుషిపాక వాసు, సామ సుజాత, జెల్ల ధనమ్మ, కొన్రెడ్డి మధు, కోడి సుష్మ, కలిమికొండ పారిజాత, కో ఆప్షన్ సభ్యులు ఖలీల్, కల్లెట్ల చంద్రకళ, మొగుదాల సత్తమ్మ, షేక్ సలీమా తదితరులు పాల్గొన్నారు.