ధర్మగడ్డ తండాలో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

విశ్వంభర, నెల్లికుదురు: ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై వ్యక్తి మృతిచెందిన  ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం కాస్య తండా లో చోటుచేసుకుంది. ఎస్సై చిర్ర రమేష్ బాబు  తెలిపిన వివరాల ప్రకారం, కాస్యతండా జిపి పరిధిలోని ధర్మ గడ్డ తండాకు చెందిన బానోతు సురేష్(35) ఆదివారం(ఈ నెల 28) రాత్రి తన బావమరిది తో కలిసి తన ఇంటి స్లాబుపై పడుకున్నాడు. మధ్య రాత్రి( సుమారు 12 గం.సమయంలో) వర్షం రావడంతో తాము పండుకున్న ఇనుప మంచాన్ని ఎత్తుకొని కిందికి దిగుతున్న క్రమంలో పైన ఉన్న  విద్యుత్ వైరు అతుకు(నక్కు) కు ప్రమాదవశాత్తు మంచం తాకింది. దీంతో సురేష్ విద్యుత్ షాక్ కు గురై కింద పడిపోయాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన మహబూబాబాద్ ఏరియా ఆసపత్రికి తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే సురేష్ మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతిడి భార్య యమున ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

🕒 30 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/a-person-died-due-to-electric-shock-in-dharmagadda-tanda/article-17360

Tags: