హంతకులందరినీ  వెంటనే అరెస్ట్ చేయాలి 

హంతకులందరినీ  వెంటనే అరెస్ట్ చేయాలి 

విశ్వంభర, హిమయతనగర్ : నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో రెండు నెలల పసిబిడ్డను కాలితో తన్ని హత్య చేసిన వారిని  కఠినంగా శిక్షించాలని, సీఎం ఈ ఘటనపై వెంటనే స్పందించాలని  తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాదు లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద రజక ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ,  రెండు నెలల పసిబిడ్డను కూడా కనికరం లేకుండా కాలితో తన్ని హత్య చేయడం సమాజం తలదించుకునే ఘటన అని అన్నారు. ఎనిమిది మందిపై ఫిర్యాదు చేసినప్పటికీ నలుగురినే అరెస్టు చేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. హత్య జరిగితే ‘అటెంప్ట్ మర్డర్’గా కేసు నమోదు చేయడం సరైంది కాదని, హత్యా నేరం కింద కేసు నమోదు చేసి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రజక అభివృద్ధి సంస్థ రాష్ట్ర నేతలు, కేవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, గోపి రజక, జూపల్లి రాజశేఖర్, ఎదునూరి మదార్, బాలాపూర్ బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: