ముగిసిన సీఎం కప్ పోటీలు
- ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
విశ్వంభర, హనుమకొండ: హనుమకొండ జిల్లాస్థాయి సీఎం కప్ ముగింపు కార్యక్రమం హనుమకొండలోని జె ఎన్ ఎస్ స్టేడియం లో ఘనంగా నిర్వహించారు. గత నాలుగు రోజులుగా ఉత్సాహభరితంగా సాగిన ఈ క్రీడా పోటీలకు ముగింపు పలుకుతూ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిమాట్లాడుతూ, గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడం లక్ష్యంగా సీఎం కప్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పాల్గొన్న క్రీడాకారులను ఎమ్మెల్యే అభినందించి, భవిష్యత్తులో జాతీయ స్థాయిలో రాణించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, డి వై ఎస్ ఓ అశోక్, నాయకులు లక్ష్మణ్ , సారంగపాణి , ఇతర అధికారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు.



