రాత్రి వేళ మఫ్టీలో నెల్లికుదురు ఎస్సై స్పెషల్ డ్రైవ్
విశ్వంభర, నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లాలో గంజాయి,ఇతర మత్తు పదార్థాల నిర్మూలనకు చేపడుతున్న ప్రత్యేక కార్యాచరణలో భాగంగా, జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు నెల్లికుదురు ఎస్ఐ చిర్ర రమేష్ బాబు, సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందాలు రాత్రి వేళల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. నెల్లికుదురు తోపాటు చుట్టు ప్రక్కల గ్రామాలలోని నిర్మానుష్య ప్రదేశాలు, ఖాళీ మైదానాలు, చెట్ల పొదలు, పార్కులు, విద్యాసంస్థల సమీప ప్రాంతాలు, యువకులు గుమిగూడే ప్రాంతాల్లో మఫ్టీలో బైక్ పై విస్తృతంగా తనిఖీలు చేపట్టి గంజాయి వినియోగంపై ఆరా తీశారు. బహిరంగ ప్రదేశాల్లో గుమి కూడిన వారికి గాంజా, ఓపెన్ డ్రింకింగ్ గురించి వివరించి రాత్రి వేళలో అనవసరంగా బయట ఉండకూడదని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆదేశాల మేరకు, గంజాయి విక్రయదారులు, సరఫరాదారులు, వినియోగదారులపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని తెలిపారు. గంజాయి యువత భవిష్యత్తును దెబ్బతీసే సామాజిక దురాచారమని, జిల్లాను పూర్తిగా గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని ఎస్సై తెలిపారు. గంజాయి విక్రయాలు, రవాణా, నిల్వ లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వారు, గంజాయి అలవాటుతో బాధపడుతున్న వారి కుటుంబ సభ్యులు జిల్లా పోలీసు హెల్ప్‌లైన్ 8712656999కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. గాంజాయి గురించి సమాచారం ఇచ్చిన వారికి జిల్లా ఎస్పీ చేతుల మీదుగారూ.5000లు రివార్డు ఇవ్వబడుతుంది అని తెలిపారు.