జోహార్ జయశంకర్ సార్ ..  తెలంగాణ దిక్సూచి - తెలంగాణ భవితకు మార్గదర్శి - ప్రో కొత్తపల్లి జయశంకర్ సార్ 

జోహార్ జయశంకర్ సార్ ..  తెలంగాణ దిక్సూచి - తెలంగాణ భవితకు మార్గదర్శి - ప్రో కొత్తపల్లి జయశంకర్ సార్ 

  • తెలంగాణ దిశా - దశ ప్రో . జయశంకర్ సార్ కి ఘన నివాళి
  •  తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు  డా|| కాచం సత్యనారాయణ

చైతన్యపురి:విశ్వంభర:  తెలంగాణ తొలిదశ ఉద్యమకారులు తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ 14 వ  వర్ధంతిని  పురస్కరించుకొని  హైద్రాబాద్ లో చైతన్యపురి  వి3 న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ,రాష్ట్ర అధ్యక్షులు    తెలంగాణ ఉద్యమకారులు డాక్టర్ కాచం సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు .. 
ఈ సందర్బంగా డా . కాచం సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం అనునిత్యం పరితపించి తెలంగాణకీ జరుగుతున్న అన్యాయాన్ని వెలుగేత్తి చాటి మలి దశ ఉద్యమానికి సిద్ధాంత కర్త గా నిలిచి , తెలంగాణ రాష్ట్రానికి  దిక్సూచిల నిరంతరం తెలంగాణ స్వరాష్ట్ర సాధన  కోసం తన సర్వస్వాన్ని ధారపోసిన మహోన్నతుడు అని, వారు చేసిన సేవలను , త్యాగనిరతిని గుర్తు చేసుకుంటూ జోహార్ జయశంకర్ సార్ అంటూ నివాళులు అర్పించడం జరిగింది.  నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుగా   తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో పాల్గొని జీవితాలను , భవిష్యత్తు ని త్యాగం చేసిన ఉద్యమకారులను ,కుటుంబాలను ఆదుకొని ఉద్యమకారులకు 250 గజాల స్థలాన్ని కేటాయించాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారులు శ్యామ్ సుందర్ గౌడ్ , బీరెల్లి వెంకట్ రెడ్డి లు మాట్లాడుతూ నాటి తెలంగాణ ఉద్యమం కోసం ప్రో . జయశంకర్ సార్ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ  ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమంలో పోరాటం చేయడం జరిగింది .పార్టీలకతీతంగా తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఉద్యమం చేసిన ఉద్యమకారులను గుర్తించి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా కల్పించాలని అన్నారు . 


ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు కూర రమేష్ , శ్యామ్ సుందర్ గౌడ్ ,  బీరెల్లి వెంకట్ రెడ్డి , పొన్నపల్లి యుగేందర్ శర్మ ,సంతోష్ , డా.యర్రమాద  కృష్ణారెడ్డి ,చెన్నోజు విద్యా సాగర్ , దండు సురేష్ , మేడికొండ పరమేష్ , ఏలే మహేష్ నేత , నరేష్, కొవ్వరు మహేష్ , అఖిల్ తదితరులు పాల్గొన్నారు

Read More అవోప ఉపాధ్యక్షుడిగా వీర బొమ్మ రమేష్