రాజీవ్ గాంధీ హయాంలోనే రామాలయ నిర్మాణానికి బీజం పడింది.. మోడీ తెలుసుకోవాలి: జీవన్ రెడ్డి

రాజీవ్ గాంధీ హయాంలోనే రామాలయ నిర్మాణానికి బీజం పడింది.. మోడీ తెలుసుకోవాలి: జీవన్ రెడ్డి

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అయోధ్యలో రామాలయాన్ని కూల్చేస్తారన్న మోడీ కామెంట్స్ పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధాని మోడీ తన స్థాయని మర్చిపోయి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజీవ్ గాంధీ బతికి ఉంటే రామాయల నిర్మాణం ఎప్పుడో పూర్తి అయ్యేదని టీ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే శిలాన్యాస్ జరిగిందని గుర్తు చేశారు. అయోధ్యలో రామాలయం గేట్లు తెరిపించిందే రాజీవ్ గాంధీ అని అన్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ, బీజేపీ నేతలు తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. 

 

Read More మాస్టర్ కారింగు రవికి ఘనంగా సన్మానం

శిలాన్యాస్ ఎప్పుడు జరిగింది? అప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉందో బీజేపీ అనుబంధ సంస్థ వీహెచ్‌పీని అడిగితే చెబుతుందని చెప్పారు. రాజీవ్ గాంధీ హయాంలో వీహెచ్‌పీ శిలాన్యాస్ చేసిందని జీవన్ రెడ్డి తెలిపారు. మోడీ వలనే రామమందిర నిర్మాణం జరిగిందని ప్రచారం చేసుకోవడంలో అర్థం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల కోసం ఆ క్రెడిట్ బీజేపీ తీసుకుంటుందని మండిపడ్డారు. అక్కడితో ఆగకుండా కాంగ్రెస్ పై దుష్ప్రచారం చేయడం సరికాదని మండిపడ్డారు. 

 

Read More మాస్టర్ కారింగు రవికి ఘనంగా సన్మానం

కాంగ్రెస్ పార్టీ వస్తే రామాలయాన్ని కూల్చేస్తారని ప్రధాని మోదీ ప్రచారం చేయడం దారుణమన్నారు. ఈ వ్యాఖ్యలతో ప్రధాని మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని విమర్శించారు. ఆయన తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రామాలయానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకంగా కాదని.. అలా అని మతతత్వ రాజకీయాలను సపోర్టు చేయమని అన్నారు. ఎన్నికల సమయంలో హిందువులను వాడుకోవడం బీజేపీకి, మోడీకి అలవాటుగా మారిందని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.