బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల

బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల

విశ్వంభర, రాజాపేట: మండలం కాల్వపల్లి గ్రామ సమీపంలో నిర్మాణంలో పొట్టి మర్రి హై లెవెల్  ఉన్న వంతెన పనులను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శుక్రవారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన నిర్మాణ స్థలాన్ని సందర్శించి, అధికారులు మరియు కాంట్రాక్టర్‌తో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. వంతెన నిర్మాణం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఈ వంతెన నిర్మాణం పూర్తయితే రవాణా సౌకర్యాలు మెరుగుపడడంతో పాటు పరిసర గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం అవుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అభివృద్ధి పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags: