మంత్రి సీతక్కను కలిసిన మంచు లక్ష్మి  

మంత్రి సీతక్కను కలిసిన మంచు లక్ష్మి  

విశ్వంభర, హైదరాబాద్  : ప్రజాభవన్లో మంత్రి సీతక్కను టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్ ఫౌండర్, సినీనటి మంచు లక్ష్మి  మర్యాదపూర్వకంగా కలిశారు. తమ సంస్థ ఆధ్వర్యంలో మార్చి 27 నిర్వహించబోయే కార్యక్రమానికి మంత్రిని ఆహ్వానించారు. ఆమె తమ ఫౌండేషన్ ద్వారా చేపట్టిన సేవా కార్యక్రమాలను వివరించి, ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యాబోధన కోసం తమ సంస్థ చేయూతగా నిలుస్తుందని తెలిపారు. మంచి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నమంచు లక్ష్మి ప్రయత్నాలను మంత్రి సీతక్క అభినందించారు.

Tags: