ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ హత్యకు ఖండిస్తూ నిరసన 

ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ హత్యకు ఖండిస్తూ నిరసన 

విశ్వంభర, మిర్యాలగూడ: ఇరాన్ పై ఇజ్రాయిల్,అమెరికా సామ్రాజ్యవాదులు దాడి చేసి ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ ని హత్య చేయటాన్ని నిరసిస్తూ మంగళవారం మిర్యాలగూడ పట్టణం ఎన్ఎస్ పి క్యాంపు లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ప్రజా సంఘాల అక్క వేదిక మిర్యాలగూడ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ ఇరాను లో అణు ఆయుధాలు ఉన్నాయనే నెపంతో 550 పైగా ఇరాన్ ప్రజలను హత్య చేయటంపట్ల యావత్ ప్రపంచం ఖండించా లని కోరారు.ఇరాక్అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ను సైతం ఇరాక్ లోప్రమాదకరసాయనక ఆయుధాలున్నాయని ఆరోపిస్తూ ఉరిశిక్ష విధించా రని.వెనిజులా అధ్యక్షుడు రాబర్ట్ మధురోతో పాటు సహచరిని  అర్థరాత్రి అధ్యక్ష భవనంపై దాడి చేసి కిడ్నాప్ చేసిఅమెరికాలోనిర్బంధించటం  అమెరికా దుర్మార్గానికి పరాకాష్ట అని అన్నారు.అమెరికా, ఇజ్రాయిల్, చేస్తున్న అధర్మయుద్ధం వల్ల ప్రపంచానికి మూడవ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉన్నదన్నారు.ఇరాన్ లో ఉన్న చమురు నిల్వలను అక్రమం గా చోరీ చేయటానికి మాత్రమే అమెరికా ఇరాన్ పై దాడి చేస్తున్నదనిఅభిప్రాయపడ్డారు.భారత ప్రభుత్వం అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ పై చేస్తున్న అధర్మయుద్ధాన్ని ఆపవలసిందిగా కోరాలని ప్రభుత్వాన్ని కోరారు. దేశంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులు అమెరికా ఇజ్రాయిల్ చేస్తున్న అధర్మ యుద్ధాన్ని ఆపవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్  భీసం రామయ్య, యుటిఎఫ్ రిటైర్డ్ నాయకులు సత్యనారాయణ రావు, రమణారెడ్డి, డిటిఎఫ్ నాయకులు బిక్షమయ్య, సామాజిక కార్యకర్త కిరణ్మయి, ఉదయకుమారి. అమృతయ్య పాల్గొన్నారు.

Tags: