చికిత్స పొందుతూ వివాహిత మృతి
విశ్వంభర, పాపన్నపేట: అనారోగ్య కారణాలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వివాహిత.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన మండల పరిధిలోని నార్సింగి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగి గ్రామానికి చెందిన జిన్న హన్మంతు, జిన్న దుర్గాభవాని(24) దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. కొంతకాలంగా దుర్గాభవాని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పలుమార్లు చికిత్స చేయించుకున్నా ఆరోగ్యం మెరుగుపడలేదు. దీంతో తరచూ తన ఆరోగ్య విషయం తలచుకుంటూ బాధపడుతుండేది. ఈ క్రమంలో గత నెల 27న రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో విష తీసుకుంది. భర్త హన్మంతు గమనించి వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది. మృతురాలి తండ్రి బాలయ్య ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.



