గౌతమ బుద్ధుడుచూపిన మార్గం ఆచరణీయం
విశ్వంభర, మిర్యాలగూడ: శాంతి అహింస చాటి చెప్పిన గౌతమబుద్ధునిమార్గంఆచరణీయం ఆదర్శనీయమని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ అన్నారు. మంగళ వారం రాత్రి అంబేద్కరిస్టులు, జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యం లో స్థానిక కళభారతి మినీ ఆడిటోరియంలో బుద్ధునితో నా ప్రయాణం నాటకం ప్రదర్శన ను ఆయన ప్రారంబించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధుని, డాక్టర్ అంబేద్కర్ చిత్రపటాల ముందు జ్యోతి వెలిగించి నివాళ్లర్పించారు. అనంతరంఆయనమాట్లాడుతూ నేడు ప్రపంచంలో ద్వేషం, హింస ప్రవృత్తి పెరిగిందని వాటిని నివారించేందుకు బుద్ధుని బోధనలుమార్గనిర్దేశం చేస్తాయని, ప్రపంచం అంతటా శాంతి లోపించిందని అయన మార్గంనేడుఅనుసరనియమన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు డాక్టర్ జె. రాజు, డాక్టర్ మువ్వా రామారావు,మాలమహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి తోపాటు నాయకులు చిలుకూరు బాలకృష్ణ, గుడిపాటి నవీన్ కళాకారుడు ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.



