ఉత్సాహంగా హోలీ వేడుకలు

ఉత్సాహంగా హోలీ వేడుకలు

విశ్వంభర, నాగారం:హోలీ అంటే అహంకారాన్ని త్యజించే పండుగ ఇది మనలోని దుష్ట భావోద్వేగాలను,హిరణ్యకశ్యపుని హోలిక రూపంలో దహనం చేసే పండుగ.కులమతాలకు అతీతంగా దేశ ప్రజలంతా జరుపుకునే ఈ హోలీ వేడుకలు సోదర భావానికి ప్రతీక.అందులో భాగంగానే నాగారం మండలంలో గ్రామ గ్రామాన హోలీ వేడుకలు చిన్నాపెద్దా తేడా లేకుండా రంగులు చల్లుకుంటు ఊరూవాడా వర్ణశోభితమైంది.ముఖ్యంగా యువతీయువకులు సంబురాల్లో మునిగిపోయారు.చాలా మంది ఒకరికొకరు రంగులు గుప్పుతూ సెల్ఫీలు దిగుతున్నారు.స్మార్ట్‌ఫోన్‌లలో ఫోటోలు తీస్తూ ఆనందంగా హోలీ సంబరాలు జరుపుకున్నారు.

Tags: