నిర్వాసితులకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుంది: ఎమ్మెల్సీ
On
విశ్వంభర, ఖమ్మం : వెలుగుమట్ల నిర్వాసితులకు భారత రాష్ట్ర సమితి అండగా ఉంటుందని ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ అన్నారు. నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసిన శిబిరంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. . బాధితులకు న్యాయం చేసేందుకు భారత రాష్ట్ర సమితి పోరాటానికి సిద్ధమవుతుందన్నారు. నిర్వాసితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో నాయకులు పగడాల నాగరాజు, కర్నాటి కృష్ణ, పద్మ తదితరులు పాల్గొన్నారు.



