హోలీ సంబరాల్లో ఎమ్మెల్యే తలసాని

హోలీ సంబరాల్లో ఎమ్మెల్యే తలసాని

విశ్వంభర, హైదరాబాద్ : ప్రేమ, ఆనందాల కలయిక హొలీ పండుగ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హొలీ సందర్భంగా మంగళవారం మోండా డివిజన్ బండిమెట్‌లో నిర్వహించిన హొలీ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని మాట్లాడుతూ.. వసంత రుతువులో వచ్చే హొలీ పండుగను చెడుపై మంచి విజయం సాధించినందుకు నిర్వహించుకుంటారని చెప్పారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీని ఆనందంగా చేసుకోవాలని కోరారు. ఈ సంబరాల్లో బీఆర్‌ఎస్‌ సీనియర్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Tags: