ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం
విశ్వంభర, మాడుగులపల్లి: ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ఆపదలో ఉన్న ఎంతో మందికి వరం లాంటిదనిఇస్కబావిగూడెంగ్రామ పంచాయతీ సర్పంచ్ కల్లూరి.అనిత - వెంక ట్ రెడ్డి అన్నారు. గ్రామానికి చెందిన తంగేళ్ల సతీష్ రెడ్డి ఇటీవల అనారోగ్యానికి గురై ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొంది ఆర్థిక సహాయం కోసం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారంతో ముఖ్య మంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సహకా రంతో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి తంగేళ్ల సతీష్ రెడ్డి కి మంజూ రైన రూ 24 వేల చెక్కును మంగళ వారం గ్రామపంచాయతీ సర్పంచ్ కల్లూరి అనిత వెంకట్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి లబ్ధిదారునికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మంచిగంటి నాగిరెడ్డి నాయకులు మంచి కంటి జగన్ రెడ్డి, పోతురాజు చంద్రయ్య, సతీష్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు,



