వైద్య విద్యార్థులకు చెక్కుల పంపిణీ

వైద్య విద్యార్థులకు చెక్కుల పంపిణీ

విశ్వంభర,  ఉప్పల్‌: ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి, ఎమ్మల్యే హరీశ్‌ రావు నివాసంలో  వైద్య విద్యార్థులకు ఆర్థిక సాయం చేశారు. బీఎల్‌ఆర్‌ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేయడం అభినందనీయమని హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో మొత్తం 122 మంది వైద్య విద్యార్థులకు వారి విద్యా ఖర్చుల కోసం ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. మంగళవారం ఏడుగురు విద్యార్థులకు సుమారు రూ.5 లక్షలు విలువైన చెక్కులను పంపిణీ చేశారు. విద్యతో సాధికారత కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆయన వెల్లడించారు.

Tags: