రోడ్డు  ప్రమాదంలో వ్యక్తి మృతి 

రోడ్డు  ప్రమాదంలో వ్యక్తి మృతి 

విశ్వంభర, నెల్లికుదురు: రోడ్డు ప్రమాదంలో  వ్యక్తి  మృతి చెందిన  ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో జరిగింది. ఎస్సై  రమేష్ బాబు వివరాల ప్రకారం,  మండలంలోని రామన్నగూడెం గ్రామానికి చెందిన గుణగంటి వెంకన్న(50) మంగళవారం తన ఇంటి నుంచి పనిమీద నెల్లికుదురుకు బైక్ పై వెళుతున్న క్రమంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడి పోవడంతో తలకు బలమైన గాయం అయింది.. వెంటనే 108 వాహనంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న క్రమంలో మృతి చెందాడు. మృతిడి  భార్య పూలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Tags: