లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. పదిమందికి గాయాలు

లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. పదిమందికి గాయాలు

విశ్వంభర,  చౌటుప్పల్ : మండలంలోని దండు మల్కాపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిడదవోలు డిపోకు చెందిన బస్సు హైదరాబాద్‌ వెళ్తుండగా.. దండు మల్కాపురం వద్ద లారీని వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags: