అగ్నిప్రమాదంలో 6 ఎకరాల జొన్న పంట దగ్ధం
On
విశ్వంభర, తాండూరు: ప్రమాదవశాత్తు పొలంలో మంటలు చెలరేగి 6 ఎకరాల జొన్న పంట దగ్ధమైంది. ఈ ఘటన తాండూరు మండలం చంద్రవంచలో జరిగింది. గ్రామానికి చెందిన కురువ మల్లేష్ ఎనిమిది ఎకరాల్లో జొన్న పంట సాగు చేశాడు. మంగళవారం ఒక్కసారిగా పొలంలో మంటలు చెలరేగాయి. మంటల్ని ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే ఆరు ఎకరాల్లో చేతికొచ్చిన జొన్న పంట మంటల్లో కాలిపోయింది. రూ.2.50 లక్షలు నష్టం వాటిల్లిందని రైతు వాపోయాడు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు విజ్ఞప్తి చేస్తున్నాడు.



