చంద్రగ్రహణం...ఆలయం మూసివేత
On
విశ్వంభర, పాపన్నపేట: చంద్రగ్రహణం సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గమాత ఆలయాన్ని మంగళవారం ఉదయం మూసివేశారు. ఆలయ అర్చకులు పార్థివశర్మ, మురళీ శర్మ, రాము శర్మలు తెల్లవారుజామున 5 గంటలకు అమ్మవారికి అభిషేకం చేపట్టి ప్రత్యేకంగా అలంకరించారు. సహస్రనామార్చన, కుంకుమార్చన చేపట్టి 6గంటలకు ఆలయ ద్వారాన్ని మూసి వేశారు. బుధవారం ఉదయం ఆలయాన్ని సంప్రోక్షణ చేసి, అమ్మవారికి అభిషేకం చేపట్టి అనంతరం ఉదయం 8గంటల నుంచి భక్తులకు దర్శనాలు కల్పించనున్నట్లు ఆలయ ఈఓ వీరేశం పేర్కొన్నారు .ఆలయ సిబ్బంది మధుసూదన్ రెడ్డి, తదితరులున్నారు.



