మనందరి కడుపు నింపే రైతన్న ఆకలి తీర్చడం మా అదృష్టం : వికారాబాద్ AMC చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్
విశ్వంభర, వికారాబాద్ ;-తెలంగాణ శాసనసభ సభాపతి వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ సహాయ సహకారాలతో వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తరపున హరేరామ హరేకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు 5 రూపాయల భోజనం ఏర్పాటు చేయడం జరిగిందని AMC చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ మరియు వైస్ చైర్మన్ పి. మల్లేశం తెలిపారు. స్వయంగా మార్కెట్ యార్డులో రైతులకు భోజనం వడ్డీంచి రైతుల నుండి సలహాలు సూచనలు తీసుకున్నారు .... ఈ సందర్బంగా పాలకవర్గం ఏర్పాటు అయినా వెంటనే చైర్మన్ ఆధ్వర్యంలో జరిగిన పాలకవర్గ సమావేశంలో ప్రతి సోమవారం మరియు గురువారం రైతులకు 5 రూపాయల మధ్యాహ్న భోజన కార్యక్రమంఏర్పాటు చేయాలని తీర్మానం చేసినట్టు తెలిపారు. దేశ ప్రజల కడుపు నింపే రైతన్నల ఆకలి తీర్చడం వారికి సేవ చేయడం మా పాలకవర్గం అదృష్టంగా భావిస్తున్నామని ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగిస్తామని ఈ సందర్బంగా తెలియజేసారు. త్వరలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సహకారంతో రైతు బజార్ బీట్లలో రైతులకు అల్పాహారం (టిఫిన్ ) పెట్టె కార్యక్రమం కూడా ప్రారంభిస్తామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో AMC డైరెక్టర్ వట్టం నర్సిములు మరియు విజయ్ కుమార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.