జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన పీపీ 

జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన పీపీ 

విశ్వంభర, సిద్దిపేట:జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జి.సుదర్శన్‌ను పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాదుల ఆత్మరాములు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తికి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం న్యాయవ్యవస్థకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అనంతరం న్యాయమూర్తి సుదర్శన్ మాట్లాడుతూ న్యాయవ్యవస్థలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పాత్ర అత్యంత కీలకమైందన్నారు. కక్షిదారుల తరఫున సమర్థవంతంగా వాదనలు వినిపిస్తూ, బాధితులకు న్యాయం జరిగేలా చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని సూచించారు. న్యాయవ్యవస్థపై ప్రజలకు మరింత విశ్వాసం పెరిగేలా ప్రతీ కేసును బాధ్యతాయుతంగా వాదించాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.జీవన్ రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు నరసయ్య, కనకయ్య, లావణ్య, సీడీవోలు శ్రీనివాస్ రెడ్డి, వేణుగోపాల్, కిష్టయ్య, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

🕒 30 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/pp-met-the-district-chief-justice/article-17433

Tags: