మంత్రి  కొండా సురేఖకు ఆహ్వాన  పత్రిక

మంత్రి  కొండా సురేఖకు ఆహ్వాన  పత్రిక

 విశ్వంభర,  జిహెచ్ఎంసి : శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థానములో 27న, శుక్రవారము అత్యంత వైభవంగా నిర్వహించనున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వార్ల కల్యాణోత్సవమునకు హాజరు కావలసినదిగా కోరుతూ తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖామాత్యురాలు కొండా సురేఖకు  ఆహ్వాన పత్రికను అందచేశారు. జూబిలీ హిల్స్ లోని మంత్రి నివాసములో ఈ రోజు ఉదయం ఆలయ కార్యనిర్వహణాధికారి యన్. లావణ్య, చైర్మన్  ఈదులకంటి సత్యనారాయణ రెడ్డి, ధర్మకర్తలు తోకటి కిరణ్ కుమార్, సింగంశెట్టి శ్రీనివాస్, జునుంపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, నారాయణ్ దుర్గా రెడ్డి, కుకునూరి గోపాల్ రెడ్డి, పూల నాగరాజు, కే. కవిత, ఓరుగంటి నరేష్, కొండ్ర సంతోష్ కుమార్, బండి శ్రీనివాస్ గౌడ్, ఎనుముల రవీందర్ రెడ్డి మంత్రిని ఆలయ వేద పండితులచే ఆశీర్వచనముతో పాటు ఆహ్వాన పత్రికను అందచేశారు.

Tags: