మహిళల ఆర్థిక, సామాజిక ప్రగతికే ఇందిరా మహిళా శక్తి: జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
- మహిళా సంఘాల భవనాలకు ప్రతిపాదనలు ఇస్తే మరుసటి రోజే మంజూరు
- ప్రతి విలేజ్ ఆర్గనైజేషన్ కు సొంత భవనం మంజూరు చేస్తాం
విశ్వంభర, సూర్యాపేట : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి నివేదికలో భాగంగా మహిళా అభ్యున్నతి కోసం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలను మరింత వేగవంతం చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళ వారోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుండి రాష్ట్రవ్యాప్తంగా 8 వేల మహిళా సమాఖ్య భవనాల నిర్మాణాలకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. అంతేకాక మహిళలకు పంపిణీ చేసే ఇందిరమ్మ చీరల నూతన డిజైన్ (చిలకపచ్చ డిజైన్) ను వర్చువల్ గా ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మహిళా సంఘ సభ్యులతో సమీక్షించారు. మరుసటి రోజే భవనాల మంజూరు.. పనులు త్వరితగతిన పూర్తి చేయాలిమహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రతి విలేజ్ ఆర్గనైజేషన్ కింద సొంత భవనం నిర్మించాలనేది ప్రభుత్వ సంకల్పం అని స్థల వివరాలతో కూడిన ప్రతిపాదనలు అందిస్తే, మరుసటి రోజే నిధులు మంజూరు చేస్తామని, అదే రోజు పనులు ప్రారంభించుకునేలా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల నిర్మాణాలను వివో సంఘాలు విజయవంతంగా పూర్తి చేసిన తరహాలోనే, ఈ భవనాలను కూడా నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని ఆయన ఆకాంక్షించారు. మహిళా శక్తి ద్వారా ఐకేపీ, మహిళా సంఘాల సభ్యులకు ఇప్పటికే చీరల పంపిణీ జరిగిందని, మిగిలి ఉన్న సూర్యాపేటలో కూడా త్వరలోనే పంపిణీ ప్రక్రియను వంద శాతం పూర్తి చేస్తామని కలెక్టర్ ప్రకటించారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే ప్రత్యేక కార్యాచరణతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి ఒక పెట్రోల్ బంకును మహిళా సంఘాలకు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే హుజూర్ నగర్ లో పెట్రోల్ బంకు నిర్మాణం చివరి దశకు చేరగా, కోదాడలో స్థలాన్ని గుర్తించామన్నారు. సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలకు సంబంధించిన లొకేషన్ ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
రైస్ మిల్లులు, సోలార్ ప్లాంట్లు, గోదాముల ఏర్పాటు
మహిళలు కేవలం ధాన్య సేకరణకే పరిమితం కాకుండా, సొంతంగా రైస్ మిల్లులు పెట్టుకునేలా ప్రభుత్వం అద్భుతమైన అవకాశం కల్పిస్తోందని కలెక్టర్ తెలిపారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటు కోసం డివిజన్‌కు రెండు చొప్పున స్థల పరిశీలన పూర్తయిందన్నారు. సూపర్ బజార్, సూపర్ మార్కెట్ల కోసం స్థలాల గుర్తింపు ప్రక్రియ త్వరలోనే పూర్తి కానుందని తెలిపారు. జిల్లాకు *16 గోదాములు మంజూరయ్యాయని, వీటికి సంబంధించిన పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని ప్రకటించారు. లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటు కోసం 10 ఎకరాల స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
రూ. 700 కోట్లు దాటిన బ్యాంక్ లింకేజ్.. మైక్రో క్రెడిట్ ప్లాన్ సిద్ధం
మహిళా సంఘాలకు ఇప్పటికే రూ. 700 కోట్లకు పైగా బ్యాంక్ లింకేజ్ రుణాలు అందించడం జరిగిందని, మహిళలు మరింత ఎక్కువ మొత్తంలో లోన్లు పొంది ఆర్థికంగా స్థిరపడేందుకు వీలుగా తక్షణమే 'మైక్రో క్రెడిట్ ప్లాన్' సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఉల్లాస్ కార్యక్రమం కింద బడికి వెళ్లే వయస్సు లేకపోయినా.. చదువుకోవాలనే ఆసక్తి ఉన్న వారికి చదువుకునేలా ప్రత్యేక అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. మహిళల ఆర్థిక ఎదుగుదలతో పాటు వారి ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలు, అంగన్‌వాడీ కేంద్రాలు పరస్పరం సమన్వయం చేసుకుంటూ పౌష్టికాహార పంపిణీపై దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామాల్లో మహిళలు, పిల్లల్లో బలహీనత, రక్తహీనత లేకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మహిళలు భద్రతతో, ఆరోగ్యంగా ఉంటూ ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి అధికారులు, సంఘాల సభ్యులు కలిసికట్టుగా శ్రమించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, డిఆర్డిఓ పి డి సన్యాసయ్య, డిడబ్ల్యుఓ నరసింహారావు, డిఎంఓ నాగేశ్వర శర్మ, జిల్లా సమక్యులు మండల సమైక్యలు అంగన్వాడీ టీచర్స్ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.