ప్రజా సమస్యలు పరిష్కరించని ప్రజావాణి ఎందుకు 

  • బి కే ఎస్ హుస్నాబాద్ డివిజన్ ఇంచార్జ్ కవ్వ వేణుగోపాల్ రెడ్డి

విశ్వంభర, హుస్నాబాద్: ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదని భారతీయ కిసాన్ సంఘ్ డివిజన్ ఇంచార్జ్, హుస్నాబాద్ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులు కవ్వ వేణుగోపాల్ రెడ్డి విమర్శించారు.జిల్లా కలెక్టర్ కార్యాలయం, హుస్నాబాద్ ఆర్డీవో కార్యాలయంలో ప్రజావాణి నిర్వహిస్తున్నప్పటికీ ప్రజలు అందజేస్తున్న ఫిర్యాదులకు సరైన పరిష్కారం లభించడం లేదన్నారు. డివిజన్ పరిధిలోని గ్రామాల నుంచి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం హుస్నాబాద్‌కు వస్తున్నా, సంవత్సరాలు గడిచినా సమస్యలు పరిష్కారం కాకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ అధికారులకు జవాబుదారీతనం ఉండాలని సూచించినప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు. ప్రజలు అందజేసిన వినతిపత్రాలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.ప్రజావాణి కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో నిర్వహించి ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకుంటే ప్రజావాణి వ్యవస్థను పునర్విమర్శించాలని ప్రజలు కోరుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రి ప్రభాకర్  వెంటనే స్పందించి ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.

🕒 26 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/why-is-the-public-voice-not-solving-public-problems/article-15923

Tags: