గర్భిణీలకు ప్రత్యేక వైద్య శిబిరం
విశ్వంభర, హనుమకొండ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు అధ్యక్షతన సోమవారం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరంగల్ చింతల్లో గర్భిణీ లకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ డాక్టర్ సత్య శారదా దేవి ప్రత్యేక వైద్య శిబిరాన్ని పరిశీలించి ప్రజలకు పలు సూచనలు చేయడం జరిగినది. ప్రతి స్త్రీ ప్రభుత్వము నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని వారి ఆరోగ్య పరీక్షలు చేయించుకొని వ్యాధులు నిర్ధారణ అయితే దానికి తగిన చికిత్సలు తీసుకోవాలని కోరినారు. స్త్రీలలో ఎక్కువగా రక్తహీనత ఉండటం వలన వివిధ రకాలైన వ్యాధులకు గురి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి స్త్రీ తన ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లయితే ఆ కుటుంబం ఆర్థికంగా ఆరోగ్యంగా సమృద్ధిగా ఉంటుందని తెలిపినారు. ఇదే కాక ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళ క్లినిక్లు జిల్లాలో నిర్వహిస్తున్నారు అట్టి కేంద్రాలకు వెళ్లి రక్తహీనత సంక్రమిత వ్యాధులు అసంక్రమిత వ్యాధులు ఒబిసిటీ గర్భ సంబంధిత వ్యాధులకు తగిన పరీక్షలు చేయించుకోవాలని వైద్యుల సలహా ప్రకారం చికిత్సలు తీసుకోవాలని కోరినారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి సాంబశివరావు మాట్లాడుతూ, లో ప్రతి ప్రాథమిక, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో స్త్రీల కొరకు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినామని తెలిపినారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వైద్య సేవలు పొందాలని కోరినారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి ,డి డబ్ల్యు ఓ వరంగల్, వైద్యాధికారులు వైద్య ఆరోగ్యశాఖ ,అంగన్వాడి సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.