24 గంటల్లో హత్య కేసు ఛేదించిన సూర్యాపేట పోలీసులు
- పాత కక్షలే కారణం..
- ఐదుగురు నిందితుల అరెస్ట్.. ఒక కారు, బైకు, కత్తి, సెల్‌ఫోన్లు స్వాధీనం
విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా ఏర్కారం గ్రామ శివారులో మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధు హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, మరో మహిళా నిందితురాలు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి ఒక కారు, ఒక బైకు, హత్యకు ఉపయోగించిన కత్తి, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ కె. నరసింహ కేసు వివరాలను వెల్లడించారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. హత్యకు గురైన వ్యక్తి ఏర్కారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధు (42). శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన మధు రాత్రి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో అతని భార్య మౌనిక సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, ఏర్కారం గ్రామ శివారులో కల్వర్టు కింద గోనె సంచిలో మధు మృతదేహం లభ్యమైంది. దీంతో కేసును హత్య కేసుగా మార్చి ఐదు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా సూర్యాపేట పట్టణంలోని తాళ్లగడ్డలో అద్దె ఇంటిని గుర్తించిన పోలీసులు అక్కడ క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. అనంతరం టేకుమట్ల గ్రామ సమీపంలోని జాతీయ రహదారి 65 వద్ద ప్రధాన నిందితులు మిద్దే జీవన్, మిద్దే ఆనంద్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య కుట్ర వెలుగులోకి వచ్చింది. 2007లో ఏర్కారం గ్రామ సర్పంచ్ మిద్దే రవీందర్ హత్య కేసులో చింతలపాటి మధు ప్రధాన నిందితుడిగా ఉండటంతో, తన తండ్రి హత్యకు ప్రతీకారంగా మధును హత్య చేసినట్లు మిద్దే జీవన్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. ఈ హత్యకు సైదులు, ప్రసాద్, ఆనంద్, భరత్ సహకరించినట్లు పోలీసులు తెలిపారు. పథకం ప్రకారం మధును తాళ్లగడ్డలోని అద్దె ఇంటికి మందు పార్టీ పేరుతో పిలిపించారు. మద్యం మత్తులో ఉన్న సమయంలో మధుపై కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి కారులో తీసుకెళ్లి ఏర్కారం శివారులో కల్వర్టు కింద పడేశారు. మధు బైకును మరో ప్రాంతంలో వదిలివేసి, హత్యకు ఉపయోగించిన కత్తి, సెల్‌ఫోన్‌ను కాల్వలో పడేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మిద్దే జీవన్, చింత సైదులు, మేదరి ప్రసాద్, మిద్దే ఆనంద్, కక్కిరేణి భరత్‌లను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. మరో నిందితురాలు భవాని పరారీలో ఉందని చెప్పారు. నిందితులపై గతంలో కూడా పలు కేసులు నమోదై ఉన్నాయని ఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో పాల్గొన్న నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసే అవకాశముందని తెలిపారు. హత్యలు, భౌతిక దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేసును వేగంగా ఛేదించిన డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐలు వెంకటయ్య, రాజశేఖర్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఎస్సైలు మరియు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.