కబ్జా కోరులను ఉపేక్షించేది లేదు

కబ్జా కోరులను ఉపేక్షించేది లేదు

  • నగర అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు
  •  అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

విశ్వంభర, హనుమకొండ : మహా నగరంలో ఉన్న ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు ప్రభుత్వం, అధికారులు చర్యలు చేపడుతున్నారని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు  నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం రోజున 30, 31 దివిజన్ పరిధిలలో రూ 103 లక్షలతో సైడ్ డ్రైనేజీ, అంతర్గత రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నిర్ణీత గడువులోగా పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టేలా చూడాలని అధికారులను కోరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శాయంపేట డివిజన్ గ్రామీణ వాతావరణంలో నుంచి పట్టణ వాతావరణం దిశగా అభివృద్ధి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.మా హయాంలో జరగడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. నియోజవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కొందరు ఓర్వలేక ప్రభుత్వంపై విమర్శలు,నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.గత పదేళ్లలో ప్రజలను మోసం,ఎన్నో భూములను కబ్జా చేసి ఇంకా సరిపోలేదని ఇప్పుడు తప్పడు ప్రచారాలతో దేవుడి పేరుతో భూములను కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.ఇంట్లో కుటుంబ సభ్యులకు అన్యాయం వేసిన మీరు నాపై మాట్లాడటం సిగ్గుచేటు.గడిచిన రెండున్నర ఏళ్లలో ఎక్కడైనా భూములు ఖబ్జాలు ఉన్నాయా అని ప్రశ్నించారు.దేవుడి పేరుతో నువ్వు చేసిన మోసం అన్ని కూడా వీడియో అధరాలతో ఉన్నాయని ఎక్కడో వేరే రాష్ట్రం నుంచి తీసుకువచ్చి పురాతన విగ్రహం అనడం ఎందుకు అని ప్రశ్నించారు.గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన నీకు పురాతన విగ్రహాలు దొరికితే పురావస్తు శాఖ అధికారులు ఎందుకు చెప్పలేదు అని మండిపడ్డారు.భద్రఖాళీ అమ్మవారి ఆలయ అభివృద్ధిలో భాగంగా అడ్డుపడుతున్నావ్ ,నీ హయాంలో శాయంపేట జరిగిని కబ్జాలు అన్ని ప్రజలకు తెలుసు.నేను 5 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న పర్వాలేదు కానీ నా హయాంలో భూ కబ్జాలకు పాల్పడితే ఎంతటి వారినైనా సరే క్షమించను అన్నారు.ప్రజల నుంచి మాట రాకుండా,మచ్చ లేని పరిపాలన అందివ్వడమే లక్ష్యంగా పని చేస్తానని చెప్పారు.రాజకీయంగా పరిపాలన పరమైన విమర్శలు చేయాలి కానీ ఇష్టమొచ్చిన మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.మీరు మారుతారని ఆశిస్తు ఇన్ని రోజులు ఓపికపట్టామని అన్నారు.ఇలాంటి భూ కబ్జాదారుల నుంచి ప్రభుత్వం మరియు వ్యక్తిగత భూములను కాపాడుకోవడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు,అధికారులు పాల్గొన్నారు.

🕒 26 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/there-is-no-neglecting-the-jawbones/article-15915

Tags: