మంచినీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి : కాలనీ ప్రెసిడెంట్ గణేష్

విశ్వంభర, బోడుప్పల్: మల్కాజిగిరి డివిజన్ శివదుర్గా నగర్ కాలనీ లో ప్రధాన సమస్య రోడ్లు, అసంపూర్తి గా ఉన్న  డ్రైనేజీ వ్యవస్థ ,  మంచినీటి కొరత సమస్యని తీర్చాలంటూ ప్రజా పాలనలో వినతి పత్రం అందజేసిన శివ దుర్గ నగర్ కాలనీవాసులు. ఈ సందర్భంగా కాలనీ ప్రెసిడెంట్ గణేష్ పండిత్ మాట్లాడుతూ, కాలనీ ఏర్పడి సుమారు 10 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేక మురుగు నీరు రోడ్డుపై వేస్తూ చిందరవందరగా బురద మయంగా రోడ్లన్నీ తయారవుతున్నాయి ప్రజలు నాన్న అవస్తులకు గురవుతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు కానీ మా సమస్యలు మాత్రం తీరడం లేదు.వీటి పైన ఎన్నోసార్లు స్థానిక నాయకులకు, అధికారులకు వినతి పత్రాలు అందజేసిన,  ఇప్పటివరకు పట్టించుకునే నాధుడే లేరని, ఎండాకాలంలో మంచి నీటి సమస్య తీవ్రంగా ఉన్నదని మంచినీరు రాక చాలా ఇబ్బందులు పడుతున్నామని దీనిపైన వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు, ఇకనైనా స్పందించి మా సమస్యలను త్వరగా తీరుస్తారని వేడుకుంటున్నారు. మేము ఈ కాలనీ ఏర్పడినప్పటి నుంచి సుమారుగా 10 సంవత్సరాలుగా గృహాన్ని నిర్మించుకొని ఇక్కడే ఉంటున్నాను. డ్రైనేజీ, సీసీ రోడ్లు అస్తవ్యస్తం వల్ల ఇక్కడ ఇల్లు నిర్మించుకున్న వారు కూడా కాలనీలో చాలామంది సొంతిల్లు ఉండి కూడా సిటీలో కిరాయికి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి త్వరగా పరిష్కరించ వలసిందిగా మనవి.ఈ కార్యక్రమము లో ప్రెసిడెంట్ గణేష్ పండిత్,వైస్ ప్రెసిడెంట్ తూడి ప్రభాకర్,జనరల్ సెక్రటరీ కట్టా ఎలెందర్ రెడ్డి  పాల్గొన్నారు.

🕒 19 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/colony-president-ganesh-needs-to-solve-fresh-water-problem-immediately/article-15373

Tags: