సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన మేర కార్పొరేషన్ చైర్మన్ 

విశ్వంభర, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మేర కులస్తులను గుర్తించి మేర కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు తెలంగాణ రాష్ట్ర సచివాలయం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని రాష్ట్ర మేర కార్పొరేషన్ చైర్మన్ సంఘ వెంకట రాజ్యం కలిసి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మేర కులస్తులను గుర్తించి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మేర కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ కి చైర్మన్, వైస్ చైర్మన్ నియమించినందుకు, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక  వెనువెంటనే 50 కోట్ల బడ్జెట్ ను మేర కార్పొరేషన్ కు ఏర్పాటు చేసినందుకు తెలంగాణ రాష్ట్రంలోని మేర కులస్తుల తరఫున ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నూతనంగా నియమింపబడ్డ  కార్పొరేషన్ చైర్మన్, వైస్ చైర్మన్ లకు శుభాకాంక్షలు తెలియజేశారు. అదే విధంగా తమతమ సమాజానికి, జాతికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేటట్లు చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉన్నదని, ప్రజల కోసం కష్టపడి పనిచేసి మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి  ప్రతి ఒక్క కార్పొరేషన్ చైర్మన్ వైస్ చైర్మన్  లు కష్టపడాలని పిలుపునిచ్చారు.

🕒 26 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/chairman-of-mera-corporation-after-meeting-cm-revanth-reddy/article-15929

Tags: