ఫోటోగ్రాఫర్ కరుణాకర్‌కు ఘన నివాళి 

ఫోటోగ్రాఫర్ కరుణాకర్‌కు ఘన నివాళి 

విశ్వంభర, కేసముద్రం: ఇటీవల అకాల మృతిచెందిన సీనియర్ ఫోటోగ్రాఫర్ ఇనుముల కరుణాకర్‌కు కేసముద్రం ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. స్థానికంగా జరిగిన సంస్మరణ సభలో ఫోటోగ్రాఫర్ మిత్రులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కరుణాకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, దశాబ్దాలుగా ఎంతోమంది జీవితాల్లోని తీపి గురుతులను తన కెమెరాలో బంధించిన కరుణాకర్ ఇక లేరనే వార్త జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కరుణాకర్ కేవలం ఫోటోగ్రాఫర్ మాత్రమే కాదు, అందరితో కలిసిమెలిసి ఉండే మంచి మనసున్న వ్యక్తి అని కొనియాడారు. ఆయన లేని లోటు ఫోటోగ్రాఫర్ కుటుంబానికి, అసోసియేషన్‌కు తీరనిదని పేర్కొన్నారు. కరుణాకర్ కుటుంబానికి అసోసియేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

🕒 26 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/tributes-to-photographer-karunakar/article-15937

Tags: