1969 ఉద్యమకారులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి
విశ్వంభర, బషీర్ బాగ్ : ఉద్యమకారుల కోసం రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేకే కమిటీలో 1969 ఉద్యమకారులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని 1969 తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం అధ్యక్షుడు చక్రహరి రామరాజు డిమాండ్ చేశారు. సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చక్రహరి రామరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసేందుకు సమయం ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమ కారులను గుర్తించి కమిటీ వేయడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఈ కమిటీ కి ఉద్యమ కారుల గుర్తించడానికి కాలపరిమితిని నిర్ణయించాలని కోరారు. సమాచార హక్కు చట్టం ప్రకారం పలు పోలీసు స్టేషన్ల లోకి వెళ్లి కేసుల గురించి అడిగితే అప్పటి రికార్డ్స్ లేవని తిరస్కరిస్తున్నారని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల ఎస్పీలు, జైళ్ల శాఖ సూపరిండెంట్ లకు తగు ఆదేశాలు ఇచ్చి జైళ్ల సర్టిఫికేట్స్, ఎఫ్ఐఆర్ కాపీలను రికార్డ్ ని తనిఖీ చేసి సర్టిఫికేట్స్ ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు వనం చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి మారం సంతోష్ రెడ్డి, పారేపల్లి నరసింహారావు, సీతారాం రెడ్డి, లక్ష్మీనారాయణ, విశ్వేశ్వర రావు, రుద్రమ్మ లు పాల్గొన్నారు.