జలమండలి గుర్తింపు, కార్మిక సంఘాల ఎన్నికల నిర్వహణ హర్షం.
ఐ.ఎన్.టి.యు.సి తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షులు, తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు మొగుళ్ళ రాజి రెడ్డి
- ప్రజాస్వామ్యంలో ట్రేడ్ యూనియన్ ఎన్నికలు అవసరం అని గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు.
విశ్వంభర, హైదరాబాద్ :- ప్రజాస్వామ్యంలో ట్రేడ్ యూనియన్ ఎన్నికలు అవసరం అని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి జలమండలి గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలు జరపాలని నిర్ణయించి, ఎన్నికల తేదీలను ప్రకటించడం పై ఐ.ఎన్.టి.యు.సి తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షులు, తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు మొగుళ్ళ రాజి రెడ్డి హర్షం వ్యక్తం చేసారు.దీర్ఘకాలికంగా పెండింగ్ లోఉన్న జలమండలి గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలు జరపాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చి, ఎన్నికల నిర్వహణకు కృషి చేసిన ఐ.ఎన్.టి.యు.సి జాతీయ అధ్యక్షులు, మాజీ ఎంపీ జి. సంజీవ రెడ్డి ను మొగుళ్ళ రాజి రెడ్డి తోపాటు ఐ.ఎన్.టి.యు.సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.డి. చంద్రశేఖర్, యూనియన్ ప్రధాన కార్యదర్శి రాఘవేంద్ర రాజ్ తదితరులు హైదరాబాద్, డి.డి. కాలనిలో శనివారం జి. సంజీవ రెడ్డి నివాసంలో కలసి శాలువా, పుష్పగుచ్చంతో సత్కరించి అభినందించారు. ఈ సందర్బంగా జి. సంజీవ రెడ్డి మాట్లాడుతూ కార్మిక వర్గం యొక్క గొంతుకు యథార్థమైన ప్రాతినిధ్యం లభించేలా చేసే కార్మిక సంఘాలు అసమానతలను తగ్గించి, మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి సహాయపడతాయని తెలిపారు. ప్రజాస్వామ్యంలో గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలు అవసరం అని, ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, జలమండలి గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించేలా ఒప్పించానని అన్నారు. కార్మికుల హక్కులను రక్షించడంతోపాటు పటిష్టం చేస్తామని వాగ్దానం చేసే ఐ.ఎన్.టి.యు.సి అనుబంధ తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ ఈ గుర్తింపు సంఘాల ఎన్నికల్లో విజయం కోసం కార్మికులందరూ ఐక్యంగా కృషి చేయాలన్నారు. మొగుళ్ళ రాజి రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్ చేసిన మొత్తం డిమాండ్ లలో సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్, ఉద్యోగులకు బోర్డు వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా ప్రకటించిన క్యాష్ ఇన్సెంటివ్, యూనిఫామ్ డ్రెస్ , ఓటీ కంపెన్సషన్, జనరల్ ట్రాన్స్ఫర్ సెక్షన్ టు సెక్షన్ ఇబ్బంది కాకుండా ట్రాన్స్ఫర్, సీనియర్ అసిస్టెంట్ పి & ఏ ఎఫ్ & ఏ టూ ఆఫీసర్ ప్రమోషన్స్, ఇన్ ఆపరేటివ్ పాన్, ఆధార్ వల్ల 3 కోట్ల పైచిలుకు చిన్న సాయి ఉద్యోగులపై భారం పడకుండా మాఫీ వంటి అనేక సమస్యలు పరిస్కారమియ్యని తెలిపారు. గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయాంలో పరిస్కారం కానీ జలమండలి కార్మికుల అనేక సమస్యల పరిష్కరానికి కృషి చేసిన తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ ను రాబోయే జలమండలి గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికల్లో కార్మికులు భారీ మెజారిటీ తో గెలిపించాలని విజ్ఞప్తి చేసారు. యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏం. రాజా, నాయకులూ వినోద్ గౌడ్, ఇందూరి తిరుపతి, శ్రీనివాస్, బి. మహేష్, జంపయ్య తదితరులు పాల్గొన్నారు.