ఢిల్లీ ట్రిప్పులు బంద్ జేసి లారీల ట్రిప్పులు పెంచండి

  •  మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు
  •  ఎన్సాన్‌పల్లి కొనుగోలు సెంటర్ పరిశీలన
  •  రైతుల సమస్యలపై ఆరా

విశ్వంభర, సిద్దిపేట: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్నమొన్నటి దాకా 90లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని చెప్పి ఇవాళ 70లక్షల టన్నులే కొంటామంటున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కోటి 40లక్షల టన్నుల వరి దిగుబడి వస్తుందని, మిగతా 70లక్షల టన్నుల ధాన్యాన్ని రైతులు దళారులకు అమ్ముకుని నష్టపోవాలా అని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఇలా ఏ ముఖ్యమంత్రి ఉన్నా రైతులకు ఇంత కష్టం ఎన్నడూ రాలేదన్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ ట్రిప్పులు బంజేసి, కొనుగోలు కేంద్రాలకు లారీల ట్రిప్పులు పెంచాలని సూచించారు. అర్బన్ మండలం ఎన్సాన్‌పల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు సోమవారం పరిశీలించారు. కల్లాల్లో రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వడ్ల కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వానికి రైతులంటే పట్టింపు లేదని, యూరియా, కరెంటు, రైతుబంధు ఇవ్వడంలో ఫెయిలైందని మండిపడ్డారు. వడ్లు కొనడం చేతగాక కేంద్రం మీద రుద్దుతున్నారని చెప్పారు. కేంద్రం కొనకపోతే ఆనాడు కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీలో ధర్నా చేసి ప్రభుత్వం మెడలు వంచామని గుర్తుచేశారు. తరుగు తీస్తే తోలు తీస్తానని సీఎం రేవంత్ రెడ్డి, కఠిన చర్యలు తీసుకుంటానని మంత్రి ఉత్తమ్ ఏసీ రూముల్లో కూర్చుని డైలాగులు కొడుతున్నారని మండిపడ్డారు. మిల్లుల్లో బస్తాకు 43కిలోలు పెడితేనే దించుకుంటామని మిల్లర్లు రైతులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 10 నుంచి 12మంది రైతులు కల్లాల్లో ప్రాణాలు విడిచారని, మీ వడ్లు కొనే పద్ధతి చూస్తే నత్తలు కూడా సిగ్గుపడతాయని ఎద్దేవా చేశారు. ఎన్సాన్‌పల్లిలో నెలన్నర రోజుల్లో కేవలం ఆరు లారీలు మాత్రమే వచ్చాయని, లారీలు, సంచులు పంపాలని రైతులు మొత్తుకుంటున్నారన్నారు. మక్కలు, సన్ ఫ్లవర్, జొన్నలు అమ్మిన రైతులకు వెంటనే ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. రెండు, మూడు రోజుల్లో వడ్ల కొనుగోళ్లలో వేగం పెంచకపోతే స్వయంగా నేనే వేలాది మంది రైతులతో కలెక్టరేట్‌ను దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు.

🕒 26 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/delhi-trips-bandh-jc-lorries-increase-trips/article-15913

Tags: