సూర్యాపేట లో మజ్జిగ పంపిణీ
విశ్వంభర, సూర్యాపేట: మానవునికి సేవ చేసినట్లయితే మాధవునికి సేవ చేసినట్లేనని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం ప్రధాన అర్చకులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాల చార్యులు తెలిపారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద బాటసారులకు వేసవి సందర్భంగా వికాస తరంగిణి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమాజసేవే లక్ష్యంగా వికాస తరంగిణి సేవలు అందిస్తుందని తెలిపారు. మండుటెండల్లో ప్రజల దాహార్తిని తీర్చుటకు గత 15 రోజులుగా వికాస తరంగిణి ఆధ్వర్యంలో దాతల సహకారంతో మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వికాస తరంగిణి సభ్యులు పాల్గొన్నారు.