మహిళా భవనాల నిర్మాణానికి శ్రీకారం

మహిళా భవనాల నిర్మాణానికి శ్రీకారం

విశ్వంభర, నెల్లికుదురు: మహిళల ఆర్థిక, సామాజిక సాధికారత, స్వయం సహాయక సంఘాల సమావేశాలు,శిక్షణ, సంక్షేమ కార్యకలాపాలకు కేంద్రంగా ఉపయోగపడనున్న సెర్ఫ్ మహిళా శక్తి భవనాల నిర్మాణానికి నెల్లికుదురు మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి కాచికల్ శ్రీరామగిరి గ్రామాలలో సోమవారం శ్రీకారం చుట్టారు. బ్రాహ్మణ కొత్తపల్లిలో సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడ్, కాచికల్ లో సర్పంచి ఇట్టె లీల దేవేందర్ రెడ్డి, శ్రీరామగిరిలో మాదరి ప్రశాంత్ లు ఎంపీడీవో సింగారపు కుమార్, ఎంపీ ఓ పద్మ,సీసీలు, మహిళా సంఘాల ప్రతినిధులతో  కలిసి భూమి పూజ  చేశారు.  ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డిఈ రాజకుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్,జిపి కార్యదర్శులు,వార్డు సభ్యులు మహిళా సంఘాల ప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు.

🕒 26 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/construction-of-womens-buildings-started/article-15950

Tags: