రామన్నపేటలో గో టు విలేజ్ కార్యక్రమం

రామన్నపేటలో గో టు విలేజ్ కార్యక్రమం

విశ్వంభర, రామన్నపేట:  తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు విద్య, ఉద్యోగ రంగాలలో 9 శాతం రిజర్వేషన్లు అమలవుతున్న విషయం విధితమే. ఈ రిజర్వేషన్లు అట్టడుగులో ఉన్న తమ జాతి బిడ్డలకు సంపూర్ణంగా అందే దిశగా ఎం.ఆర్.పి.ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు  మందకృష్ణ మాదిగ "గో టు విలేజ్" అనే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం రోజు యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలో జరిగిన సమావేశానికి ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ మాదిగ హాజరై మాట్లాడుతూ, గత 30 సంవత్సరాలు ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ నాయకత్వంలో అనేక ఉద్యమాలు చేసి వర్గీకరణ సాధించామని, ఇప్పుడు ఆ వర్గీకరణ ఫలాలు మాదిగ విద్యార్థులు అందిపుచ్చుకోవాలని, అందు కోసం మాదిగ విద్యార్థులను చైతన్యపరచడం కోసం మందకృష్ణ మాదిగ "గో టూ విలేజ్" అనే కార్యక్రమాన్ని చేపట్టాడని అన్నారు. అదే విధంగా ఎమ్మార్పీఎస్ నూతన కమిటీలను నిర్మించే ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ దిమ్మెలు నిర్మించాలని కోరారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు ఈర్లపల్లి మల్లయ్య మాదిగ, కక్కిరేణి పాపయ్య మాదిగ, జిల్లా కార్యదర్శి నల్ల స్వామి మాదిగ, టౌన్ ప్రెసిడెంట్ బొడ్డు శంకర్ మాదిగ, మేడి శంకర్ మాదిగ, కక్కిరేణి శంకర్ మాదిగ, నల్ల సాయిలు, దేశపాక నరసింహలు పాల్గొన్నారు.

🕒 26 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/go-to-village-program-in-ramannapet/article-15901

Tags: