ధాన్యం కొనుగోళ్లు వెంటనే వేగవంతం చేయాలి

ధాన్యం కొనుగోళ్లు వెంటనే వేగవంతం చేయాలి

  • ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకు నష్టం ..
  • హుస్నాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు :   అయిలేని మల్లికార్జున రెడ్డి

విశ్వంభర, హుస్నాబాద్ : హుస్నాబాద్ మండలం పోట్లపల్లి గ్రామ రైతులు ధాన్యం కొనుగోళ్లు వెంటనే చేపట్టాలని కోరుతూ నిరసన  కార్యక్రమం నిర్వహించారు. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు అయిలేని మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ, రైతులు ఎన్నో కష్టాలు పడి, భారీ పెట్టుబడులతో పండించిన పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కొనుగోలు ప్రక్రియ ఆలస్యం కావడంతో అకాల వర్షాల కారణంగా రైతుల ధాన్యం తడిసి నష్టపోయే పరిస్థితి నెలకొన్నదని అన్నారు. పదిహేను రోజులుగా సక్రమంగా కొనుగోళ్లు జరగక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్పుకుంటూ రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులు ఎండలో ఎండుతూ, వర్షంలో తడుస్తూ కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారని అన్నారు. ఇప్పటికే కొనుగోళ్లు పూర్తికావాల్సి ఉండగా ఆలస్యం కారణంగా రైతులు నష్టపోతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాచపల్లి శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు యాస శ్రీనివాస్, కొమ్మేర నర్సింహారెడ్డి, దేవసాని శ్రీనివాస్ రెడ్డి, రైతులు దుద్దుల లింగవ్వ, జిలా కనుకయ్య, మేడవేణి కనుకయ్య, సుంకరి శ్రీనివాస్, శంకర్ బాబు, తాటిపాముల తిరుపతి, కిషన్ తదితరులు పాల్గొన్నారు.

🕒 26 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/grain-procurement-should-be-expedited-immediately/article-15944

Tags: