గజ్వేల్‌లో రైతు గోస–బీజేపీ భరోసా
విశ్వంభర, గజ్వేల్ : రైతుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, వెంటనే సమర్థవంతమైన కొనుగోలు చర్యలు చేపట్టాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు అన్నారు. రైతు గోస–బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా తెలంగాణ బీజేపీ ప్రతినిధి బృందం గజ్వేల్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతుల సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించింది. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి కొనుగోలు కేంద్రాల్లో గన్ని సంచులు, రవాణా, ధాన్యం తరలింపు వంటి అంశాల్లో ఏర్పడిన ఇబ్బందులను తెలుసుకుంది. ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేయడంలో విఫలమైందని బీజేపీ నాయకులు విమర్శించారు. బీజేపీ పర్యటన ప్రకటించిన తర్వాతే ప్రభుత్వం హడావిడిగా ధాన్యం తరలింపు చర్యలు ప్రారంభించిందని ఎన్. రామచందర్ రావు ఆరోపించారు. రైతులు తెలిపిన ప్రకారం గన్ని సంచులు కేవలం నిన్ననే అందుబాటులోకి వచ్చాయని, కలెక్టర్ అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వివరించారు. రైతుల హక్కుల కోసం బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని, ప్రతి రైతుకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) అందే వరకు ఉద్యమం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ బీజేపీ నాయకులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.