ధర్మ తండాలో గుడుంబా పై పోలీస్ దాడులు

ధర్మ తండాలో గుడుంబా పై పోలీస్ దాడులు

  • 1,000లీ. పానకం 50 లీ.గుడుంబా ధ్వంసం..
  • ఇద్దరిపై కేసు నమోదు: ఎస్ ఐ రమేష్ బాబు

విశ్వంభర, నెల్లికుదురు: ప్రజారోగ్యానికి తీవ్ర విఘాతం కలిగించే గుడుంబా తయారీ, రవాణా, విక్రయాలపై మహబూబాబాద్ జిల్లాలో ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. ఇందులో భాగంగా నెల్లికుదురు ఎస్సై చిర్ర రమేష్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు మండలంలోని కాస్య తండా శివారు ధర్మ తండాలో మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై రమేష్ బాబు మాట్లాడుతూ సంబంధిత ప్రత్యేక దాడులు,సోదాలలో రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన 50 లీటర్ల గుడుంబా, గుడుంబా తయారీ కోసం నిలువ ఉంచిన 1,000 లీటర్ల బెల్లం పానకం గుర్తించి స్వాధీనం చేసుకొని అక్కడికక్కడే ధ్వంసం చేసినట్లు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.30 వేలు ఉంటుందని చెప్పారు. ఈ కేసులో అదే తండాకు చెందిన బానోతు నరేష్,బానోతు సురేష్ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. నిషేధిత గుడుంబా తయారుచేసిన విక్రయించిన, బెల్లం అమ్మకానికి పాల్పడటం వంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుడుంబా నిర్మూలన చర్యలు నిరంతరం కొనసాగుతాయని ఎస్ఐ తెలిపారు.

🕒 26 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/crime/police-raids-on-gudumba-in-dharma-tanda/article-15879

Tags:  

Advertisement

LatestNews

అనంతపురం జేఎన్‌టీయూఏకు అరుదైన గౌరవం.. 80వ వార్షికోత్సవంలో 'మై స్టాంప్' ఆవిష్కరణ
బోయలపల్లిలో గొర్రెల మందపై చిరుత దాడి.. అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ హెచ్చరిక
కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి ఓటరు తప్పనిసరిగా పాల్గొనాలి. - 
డబ్బు ఆశ చూపి చిన్నారులను తీసుకెళ్లేందుకు యత్నం.. పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు
27 రోజుల నిరాహార దీక్ష అనంతరం జంతర్ మంతర్‌కు సోనం వాంగ్‌చుక్ రాక
పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ అంతరాయం.. ఫోన్ ఫ్లాష్‌లైట్‌తో చికిత్స?