తెలంగాణ నుండి కేన్స్ వరకు చేనేత వైభవం
మగ్గం నుండి రెడ్ కార్పెట్ మెట్ల వరకు.- రష్మీ ఠాకూర్ సందేశం, మిస్ ఆసియా ఇంటర్నేషనల్, ఇక్కత్ హ్యాండ్లూమ్స్ అంబాసిడర్ భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ
విశ్వంభర, హైదరాబాద్ :- నమస్కారం, 200 సంవత్సరాల తెలంగాణ వారసత్వాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లే అవకాశం నాకు లభించడం ఎంతో గర్వంగా , గౌరవంగా భావిస్తున్నాని మిస్ ఆసియా ఇంటర్నేషనల్, ఇక్కత్ హ్యాండ్లూమ్స్ అంబాసిడర్ భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ రష్మీ ఠాకూర్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. 2026 మే నెలలో 17 వ తేదీ నుండి 21 వరకు జరగనున్న 79వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం నాకు లభించిన గొప్ప అదృష్టమని అన్నారు. . తెలంగాణ చరిత్రలో మొట్టమొదటిసారిగా, పోచంపల్లి ఇక్కత్ చేనేత ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక రెడ్ కార్పెట్‌పై నడవబోతోంది.ఇది నా ఒక్కదాని గర్వం మాత్రమే కాదు. పోచంపల్లిలో మగ్గం ముందు కూర్చొని వందల గంటలు శ్రమించిన ప్రతి నేతన్న, నేతక్క గర్వం. మన దారం ఇప్పుడు ప్రపంచ దారంగా మారిందని హర్షం వ్యక్తం చేశారు. నన్ను ఇక్కత్ హ్యాండ్లూమ్స్ అంబాసిడర్‌గా నియమించి, ఈ చారిత్రాత్మక అవకాశాన్ని అందించిన భారత ప్రభుత్వానికి, జౌళి మంత్రిత్వ శాఖకు, చేనేత అభివృద్ధి కమిషనర్ కార్యాలయానికి, వీవర్స్ సర్వీస్ సెంటర్ హైదరాబాద్‌కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.అలాగే పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ (PPCL Weaves), పోచంపల్లి టై & డై సంస్థలకు, గౌరవనీయులైన పోచంపల్లి నేతన్నలు, నేతక్కలు మరియు అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. నన్ను ఇక్కత్ హ్యాండ్లూమ్స్ అంబాసిడర్‌గా నియమించి, ఈ చారిత్రాత్మక అవకాశాన్ని అందించినందుకు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు తన సందేశాన్ని పంచుకున్నారు. దీనికి సంబందించిన, ఎల్బీనగర్ పద్మశాలి , చేనేత ప్రముఖులు , పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ (అలాగే పోచంపల్లి టై & డై సంస్థల ప్రతినిధులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.