మహేశ్వరంలో మహిళ అదృశ్యం
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ అదృశ్యమైన ఘటనపై స్థానిక మహేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. మహేశ్వరం గ్రామానికి చెందిన ఎరమోని శేఖర్ (34) జేసీబీ ఆపరేటర్గా జీవనం సాగిస్తున్నారు. తన భార్య భాగ్యమ్మ (30) కనిపించడం లేదని మే 20న రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు, శేఖర్ తెలిపిన వివరాల మేరకు, 14 సంవత్సరాల క్రితం తలకొండపల్లి గ్రామానికి చెందిన భాగ్యమ్మను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. మే 19న సాయంత్రం కుటుంబ సమస్యల నేపథ్యంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ సందర్భంగా భార్య మెడలో ఉన్న పుస్తెల తాడు తీసివేయడంతో, పుస్తెల తాడుతెంచుకుంటావా అంటూ భాగ్యమ్మ ఇంటి నుంచి వెళ్లి పోయి మళ్లీ తిరిగి రాలేదు. బంధువుల ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆమె ఆచూకీ లభించలేదని భర్త ఫిర్యాదులో పేర్కొన్నాడు. గతంలో కూడా గొడవల కారణంగా ఇంటి నుంచి వెళ్లి తిరిగి వచ్చిన సందర్భాలు ఉన్నాయని తెలిపాడు. అదృశ్యమైన మహిళ ఎత్తు సుమారు 5.6 అడుగులు, గోధుమ వర్ణం కలిగి ఉండి, నారింజ రంగు చీర, ఆకుపచ్చ జాకెట్ ధరించి ఉందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాఘవేందర్‌రావు తెలిపారు.