న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ ను హంతకులను వెంటనే అరెస్టు చేయాలి
విశ్వంభర, రామన్నపేట: హైదరాబాదులో న్యాయవాది ఖాజా మొయిజుద్దిన్ పై పథకం ప్రకారం కారుతో దాడి చేసి, హత్య చేసిన దుండగులను, వారి వెనుక ఉన్న రాజకీయ నాయకులను తక్షణమే అరెస్ట్ చేయాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) రాష్ట్ర ఉపాధ్యక్షులు, యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలానికి చెందిన మామిడి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయవాదిపై ముందు నుండే బెదిరింపులు, దాడుల నేపథ్యంలో పోలీసులు సరైన భద్రత అందించలేదని, ఇది విచారకరమని, మరణించిన న్యాయవాది కుటుంబ సభ్యులకు ప్రభుత్వము తగినంత భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. న్యాయవాద రక్షణ చట్టం అమలులోకి వచ్చినప్పటికీ న్యాయవాదులపై దాడులు కొనసాగుతున్నయని, ఇవి పెరిగి పోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ఏఐఎల్‌యూ ప్రగాఢమైన సానుభూతి తెలియజేసింది. ఒక న్యాయవాదిపై వ్యక్తిగతంగా దాడి చేసి చంపితే న్యాయం దొరుకుతుందని కొంతమంది అనుకుంటున్నారని, వ్యక్తులను చంపితే న్యాయం అన్యాయమైపోదని వారు అన్నారు. న్యాయవాదులపై దాడి చేయాలని సంస్కృతికి ముగింపు పలకాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ యాదాసు యాదయ్య, ఐలు జిల్లా ఉపాధ్యక్షులు పాల్వంచ జగతయ్య, గడ్డం నర్సయ్య జితేందర్ తదితరులు పాల్గొన్నారు.