ఐకేపీ కేంద్రాల్లో కొనుగోళ్లు అస్తవ్యస్తం

  • ‘రైతు గోస - బీజేపీ భరోసా’లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు

విశ్వంభర, కేసముద్రం: ​కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ​తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ‘రైతు గోస - బీజేపీ భరోసా’ కార్యక్రమంలో భాగంగా సోమవారం కేసముద్రం మండలంలో విస్తృత పర్యటన నిర్వహించారు. ​కేసముద్రం మండల శాఖ అధ్యక్షుడు ఉప్పునూతల రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని కేసముద్రం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ నాయకుల బృందం సందర్శించింది. కేంద్రంలో పడిగాపులు కాస్తున్న రైతులతో నేరుగా మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న కష్టాలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ​అనంతరం వల్లభు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు వారాల తరబడి కొనుగోలు కేంద్రాల వద్దే నిరీక్షించాల్సి రావడం దుర్మార్గమన్నారు ముందస్తు ప్రణాళికలు లేకపోవడం వల్లే గొనె సంచుల కొరత, రవాణా (లారీల) సమస్య వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తూకాల్లో జరుగుతున్న మోసాలపై, తరుగు పేరుతో క్వింటాలుకు చేస్తున్న కటింగ్‌లపై అక్కడి అధికారులను ఆయన నిలదీశారు. కొనుగోలు కేంద్రాలకు వస్తున్న రైతులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయని ధ్వజమెత్తారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా కనీసం తాగడానికి మంచినీటి సౌకర్యం లేదని, నీడ కోసం టార్పాలిన్లు, షెడ్లు ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు. కేసముద్రం మండల శాఖ అధ్యక్షుడు ఉప్పునూతల రమేష్ మాట్లాడుతూ రైతులకు పూర్తి స్థాయిలో కనీస వసతులు కల్పించి, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. రైతాంగానికి న్యాయం జరిగే వరకు బీజేపీ క్షేత్రస్థాయిలో పోరాడుతుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో  బిజెపి జిల్లా ఉపాద్యక్ష్డు పొదిల నరసింహ రెడ్డి, కేసముద్రం మండల శాఖ అధ్యక్షుడు ఉప్పునూతల రమేష్, మండల మున్సిపలిటి కన్వీనర్ బోగోజునగేశ్వర చారి, , మంగిశెట్టి నాగన్న, మల్యాల  రాములు, పోలేపల్లి సంపత్ రెడ్డి, బానోత్ రాము, వెం సుదీష్ , కేసముద్రం మండల బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.

🕒 26 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/shopping-at-ikp-centers-is-chaotic/article-15893

Tags: