వేసవి శిక్షణా శిబిరం ముగింపు

వేసవి శిక్షణా శిబిరం ముగింపు

విశ్వంభర, చింతపల్లి: చింతపల్లి మండలంలోని గొడకొండ్ల (వీటి నగర్) పాఠశాలలో విద్యార్థుల కొరకు ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరం 15 రోజుల పాటు కొనసాగింది. విద్యార్థులకు చిత్ర లేఖనం, యోగ, నృత్యం, పాటలు, వివిధ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. పాఠశాలల విద్యార్థులు ఉత్తేజంతో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేడు సోమవారం వేసవి శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమానికి మండల విద్యాధికారి నీరుడు అంజయ్య పాల్గొని విద్యార్థులకు బహుమతులు అందజేశారు.‌ ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణవేణి, ఉపాధ్యాయులు బాల్రెడ్డి, మణిపాల్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

🕒 26 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/end-of-summer-training-camp/article-15968

Tags: